: సిద్దాంతం కోసం ప్రియురాలిని వదిలేసా: కరుణానిథి

విధానాలకు కట్టుబడడం కోసం మనస్సాక్షిగా ప్రేమించిన ప్రేయసిని ఒదులుకున్నానని డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి తెలిపారు. ఆత్మగౌరవంతో కూడిన వివాహాలను సమర్ధిస్తూ ఆయన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. 89 ఏళ్ల కరునాణిధి ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తన గత స్మృతులను నెమరువేసుకున్నారు. 1944లో పాత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంటే తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ఆమె తల్లిదండ్రులు చెప్పారని, సంప్రదాయ విరుద్ధంగా ఆత్మగౌరవంతో జరిగాలన్న తన నిర్ణయాన్ని వారు అంగీకరించలేదని, దీంతో ఆమెను ఒదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తరువాత పెరియార్, అన్నాదురై ప్రోత్సాహంతో దయాళును కరుణానిథి వివాహమాడారు.

More Telugu News