ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు

  • ఇదే చివరి సీజన్ అని ప్రకటించిన రాయుడు 
  • 13 ఏళ్ల పాటు రెండు గొప్ప జట్లకు ఆడానని వెల్లడి 
  • ముంబై ఇండియన్స్, సీఎస్కేకు ధన్యవాదాలు అంటూ ట్వీట్  
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో షాక్. జట్టుతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అంబటి రాయుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు రాయుడు శనివారం ట్వీట్ పోస్ట్ చేశాడు. తనకు ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రకటించి అభిమానులను నిరాశకు గురిచేశాడు.

‘‘ఇదే నా చివరి ఐపీఎల్ అని సంతోషంగా ప్రకటిస్తున్నా. ఎంతోకాలం పాటు ఆడే అవకాశం నాకు లభించింది. 13 ఏళ్ల పాటు రెండు గొప్ప జట్లతో కలసి నడిచాను. ఈ అవకాశం కల్పించినందుకు ముంబై ఇండియన్స్, సీఎస్కేకు ప్రేమపూర్వక ధన్యవాదాలు’’ అంటూ అంబటి రాయడు ట్వీట్ చేశాడు. 

ఇక రాయుడు ఈ సీజన్ లో గుజరాత్ తో మ్యాచ్ లో 46 పరుగులు, ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో 40 పరుగులు, పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 78 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఐపీఎల్ 2010 సీజన్ తో అడుగు పెట్టిన అతడు 187 మ్యాచుల్లో 4,187 పరుగులు సాధించాడు.

Ambati Rayudu
announces
retirement
ipl
csk

More Telugu News