బాలీవుడ్ వాళ్లు ఇకపై తమ సినిమాలను ఓటీటీలకు తీసుకోవాల్సిందే: రామ్ గోపాల్ వర్మ
- బాలీవుడ్ ను షేక్ చేస్తున్న దక్షిణాది చిత్రాలు
- బాలీవుడ్ వెనుకపడటంపై ఇప్పటికే పెద్ద చర్చ
- ఉత్తరాది చిత్రాలు డీలా పడ్డాయంటూ తాజాగా వర్మ ట్వీట్
దక్షిణాది చిత్రాలు ఘన విజయాలను అందుకోవడం, ఉత్తరాది చిత్రాలు డీలా పడటం చూస్తుంటే... కేవలం ఓటీటీల కోసమే బాలీవుడ్ సినిమాలను తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయని వర్మ అన్నారు. బాలీవుడ్ ని దక్షిణాది సినిమాలు డామినేట్ చేస్తున్నాయనే చర్చ ఇప్పటికే పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ తరుణంలో వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచేలా ఉన్నాయి.