అలాట్ మెంట్ ప్రక్రియ పూర్తి.. 17న ఎల్ఐసీ లిస్టింగ్!
- ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.949గా ఖరారు
- సోమవారం ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో షేర్ల జమ
- కేంద్ర సర్కారుకు రూ.20వేల కోట్లు
పాలసీదారులకు ఒక్కో షేరుపై ఎల్ఐసీ రూ.60 డిస్కౌంట్ ఆఫర్ చేసింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 తగ్గింపు ఇచ్చింది. షేర్ల అలాట్ మెంట్ ప్రక్రియ ముగిసింది. అలాట్ కాని వారికి బ్లాక్ అయిన నగదు మొత్తం శుక్రవారం అన్ బ్లాక్ అవుతుంది. వచ్చే సోమవారం ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. మంగళవారం, 17న స్టాక్ ఎక్సేంజ్ ల్లో ఎల్ఐసీ లిస్ట్ కానుంది. జీవిత బీమా రంగంలో 65 శాతం మార్కెట్ వాటాతో ఎల్ఐసీ దిగ్గజ సంస్థగా ఉండడం తెలిసిందే.