Telangana: తెలంగాణ‌లో 23 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు

  • జూన్ 1 వ‌ర‌కు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌
  • ఇప్ప‌టికే 1 నుంచి 9 త‌ర‌గ‌తుల‌కు సెల‌వులు
  • టెన్త్ ప‌రీక్ష‌లతో ముగియ‌నున్న‌ విద్యా సంవ‌త్స‌రం
10th exams will commences from 23rd of this month

తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఈ నెల 23 నుంచి మొద‌లు కానున్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల (జూన్‌) 1 దాకా కొన‌సాగ‌నున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ విద్యా శాఖ బుధ‌వారం రాత్రి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే 1 నుంచి 9 త‌ర‌గ‌తుల‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు పూర్తయిన వెంట‌నే ఈ విద్యా సంవ‌త్స‌రం ముగిసిన‌ట్ల‌వుతుంది.

More Telugu News