Nara Lokesh: గాయపడిన లెక్చరర్‌కు స్వీపర్, సెక్యూరిటీ గార్డు చికిత్స చేయడం ప‌ట్ల లోకేశ్ మండిపాటు

lokesh slams ycp
  • ప్రజారోగ్య దేవుడిగా జ‌గ‌న్ ప్ర‌చారం చేసుకుంటున్నార‌న్న లోకేశ్
  • వాస్తవానికి ప్రజల పాలిట యముడిలా త‌యార‌య్యార‌ని విమ‌ర్శ
  • ప్రభుత్వ ఆసుప‌త్రిలో చేరడమే శాపమా? అని నిల‌దీత‌
  • జ‌గ‌న్‌కు ఇచ్చిన‌ ఒక్క ఛాన్స్‌తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని వ్యాఖ్య‌
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. యాక్సిడెంట్‌లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఈ రోజు నారా లోకేశ్ అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ...  ప్రజారోగ్య దేవుడిగా ప్ర‌చారం చేసుకుంటోన్న జ‌గ‌న్ వాస్తవానికి ప్రజల పాలిట యముడిలా త‌యార‌య్యార‌ని విమ‌ర్శించారు. 

గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుప‌త్రిలో చేరడమే శాపమా? అని ప్రశ్నించారు. డ్యూటీ డాక్టర్ ఉండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేయించ‌డం ఏంట‌ని నిల‌దీశారు. ఏపీలో జ‌గ‌న్ కి ప్ర‌జ‌లు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని విమ‌ర్శించారు. 

కక్షసాధింపు చ‌ర్య‌లే ల‌క్ష్యంగా జగన్ ప్రభుత్వం ప‌నిచేస్తోంటే ఏపీలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనాల‌ ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని చెప్పారు. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా స‌ర్కారు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని అన్నారు. 

Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News