Jack Dorsey: డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ శాశ్వత నిషేధం తప్పే: మాజీ సీఈవో జాక్ డోర్సీ సంచలన వ్యాఖ్యలు

  • ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై నిషేధం ‘వ్యాపార నిర్ణయం’ అన్న డోర్సీ
  • అలా చేసి ఉండకూడదని వ్యాఖ్యలు 
  • ట్విట్టర్ తన నిర్ణయాలను పునఃసమీక్షించుకుంటూ ఉండాలని సూచన
 Dorsey agrees with Elon Musk on reversing Twitters ban on Trump

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రకటనపై ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ స్పందించారు. మస్క్ ప్రకటనతో ఏకీభవించారు. ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను శాశ్వతంగా నిషేధించిన సమయంలో సీఈవోగా ఉన్న డోర్సీ ఇప్పుడీ ప్రకటన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 

ట్విట్టర్‌లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు డోర్సీ స్పందిస్తూ.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించడం ‘వ్యాపార నిర్ణయం’ అని, అలా చేసి ఉండకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ తన నిర్ణయాన్ని ఎప్పుడూ పునఃసమీక్షించుకుంటూ ఉండాలని, అవసరమైన విధంగా అభివృద్ధి చెందుతూ ఉండాలని అభిప్రాయపడ్డారు. 

శాశ్వత నిషేధాలు కంపెనీ వైఫల్యానికి నిదర్శనమని, అవెప్పుడూ పనిచేయవని అన్నారు. చట్టవిరుద్ధమైన ప్రవర్తన, స్పామ్, లేదంటే నెట్‌వర్క్ మానిప్యులేషన్ వంటి వాటితో ప్రమేయం ఉన్నప్పుడు మాత్రమే శాశ్వత నిషేధం విధించాలని డోర్సీ చెప్పుకొచ్చారు.

More Telugu News