Telangana: ఫుడింగ్ ప‌బ్ య‌జ‌మాని అభిషేక్‌కు బెయిల్‌...మేనేజ‌ర్‌కు దొరక‌ని ఊర‌ట‌

in pub case bail granted to pub owner abhishek
షార్ట్స్‌లో చూడండి
హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపిన ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ కేసులో ప‌బ్ య‌జ‌మాని ఉప్పాల అభిషేక్‌కు బెయిల్ ల‌భించింది. ఇదే కేసులో అభిషేక్‌తో పాటు అరెస్టయిన ప‌బ్ మేనేజ‌ర్ అనిల్‌కు మాత్రం బెయిల్ ద‌క్క‌లేదు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఇద్ద‌రు నిందితుల బెయిల్ పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిపిన నాంప‌ల్లి కోర్టు అభిషేక్‌కు మాత్ర‌మే బెయిల్ మంజూరు చేసింది.

గ‌త నెల‌లో ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌పై పోలీసులు దాడి జ‌ర‌ప‌గా...4.6 గ్రాముల కొకైన్ ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా ప‌బ్ మేనేజ‌ర్ అనిల్‌ను, ఏ2గా అభిషేక్‌ను చేర్చిన పోలీసులు ఇద్ద‌రినీ అరెస్ట్ చేశారు. అయితే త‌మ‌కు బెయిల్ ఇవ్వాలంటూ వారు నాంప‌ల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో అభిషేక్‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రెండు వారాల‌కు ఓ మారు బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో సంత‌కం పెట్టాల‌ని ఆయ‌న‌కు ష‌ర‌తు విధించింది.
Go Back to Shorts
Telangana
Hyderabad
Pub Case
Drugs

More Telugu News