ఎమ్మెస్ రాజు తనయుడు హీరోగా 'సతి'
- ఎమ్మెస్ రాజు నుంచి మరో ప్రేమకథ
- కొంతసేపటి క్రితం వదిలిన ఫస్టు పోస్టర్
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది
- కథానాయికగా మెహర్ చాహల్ పరిచయం
తన తనయుడు సుమంత్ అశ్విన్ తో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలా చేసిన '7 డేస్ 6 నైట్స్' సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే ఎమ్మెస్ రాజు తన తనయుడు హీరోగా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించారు .. ఆ సినిమా పేరే 'సతి'. ఈ సినిమా షూటింగును మొదలుపెట్టి కొన్ని రోజులు అవుతోందట.
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జాతర నేపథ్యంలో ఒక ప్రేమజంటను చూపిస్తూ ఈ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ ను చూస్తుంటే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా అనిపిస్తోంది. ఈ సినిమాతో కథానాయికగా మెహర్ చాహల్ పరిచయమవుతోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.