Rekha Naik: రోడ్డు ప్రమాద బాధితులని సొంత కారులో ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే రేఖా నాయక్

TRS MLA Rekha Naik humanitarian gesture towards road accident victims
  • కడెం నుంచి నిర్మల్ వెళుతున్న ఎమ్మెల్యే
  • తర్లపాడ్ వద్ద చెట్టును గుద్దిన ఓ కారు
  • కారులోని వారికి తీవ్ర గాయాలు
  • వెంటనే తన వాహనం ఆపించిన రేఖా నాయక్
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే రేఖా నాయక్ రోడ్డు ప్రమాద బాధితుల పట్ల మానవతా దృక్పథం ప్రదర్శించారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ కడెం పర్యటన ముగించుకుని నిర్మల్ వెళుతుండగా, ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ శివార్లలో ఓ కారు చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైనట్టు గమనించారు.

వెంటనే తన వాహనాన్ని ఆపించిన ఎమ్మెల్యే రేఖా కిందికి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఆ కారులోని వారు తీవ్ర గాయాలపాలైన విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే తన సిబ్బంది సాయంతో వారిని తన కారులోకి చేర్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
.
Rekha Naik
Road Accident
Victims
TRS
Telangana

More Telugu News