P Narayana: నారాయణ కిడ్నాప్ కు గురయ్యారంటూ రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు... ఏపీ పోలీసులున్న వాహనాన్ని ఆపేసిన తెలంగాణ పోలీసులు 

Former minister Narayana staff approached Rayadurgam police
  • ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్
  • హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ
  • నారాయణ సొంత కారులోనే తరలింపు
  • పోలీసులను ఆశ్రయించిన నారాయణ వ్యక్తిగత సిబ్బంది
ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారంలో కొద్దిపాటి డ్రామా చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఐడీ పోలీసులు ఇవాళ నారాయణను హైదరాబాదులో అరెస్ట్ చేయడం తెలిసిందే. దాంతో, నారాయణ సిబ్బంది తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. మాజీ మంత్రి నారాయణ కిడ్నాప్ కు గురయ్యారంటూ వ్యక్తిగత సహాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ చేశారు. షాద్ నగర్ కొత్తూరు సమీపంలో ఏపీ పోలీసులు ఉన్న వాహనాన్ని తెలంగాణ పోలీసులు ఆపేశారు. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారంలో నారాయణను అదుపులోకి తీసుకున్నట్టు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు వివరించారు. అనంతరం, అక్కడ్నించి నారాయణను చిత్తూరుకు తరలించారు.
P Narayana
Arrest
Kidnap
Police
Rayadurgam
Hyderabad
Andhra Pradesh

More Telugu News