చిరంజీవి 'గాడ్ ఫాదర్' కూడా అదే రోజు వస్తుందట!
- మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫర్'
- తెలుగు రీమేక్ గా వస్తున్న 'గాడ్ ఫాదర్'
- ఈ నెల 12వ తేదీన రిలీజ్ చేసే ఆలోచన
- అదే రోజున బరిలో ఉన్న మూడు సినిమాలు
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. నయనతార .. సత్యదేవ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. మెగా అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన థియేటర్లలో దింపాలనే ఆలోచన చేస్తున్నారట.
కంటెంట్ పరంగా ఈ సినిమా ఆగస్టు 15 నాటికి థియేటర్లలో ఉండేలా చూడాలని భావించారట. అందువల్లనే ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా సమాచారం. అదే రోజున సమంత .. అఖిల్ .. నితిన్ సినిమాలో బరిలో ఉండటం విశేషం. మలయాళంలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, తెలుగు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.