Bumrah: బెంబేలెత్తించిన బుమ్రా... కోల్ కతా 165-9

  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా
  • 10 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన బుమ్రా
  • విలవిల్లాడిన కోల్ కతా లోయరార్డర్
Bumrah bags five wickets

గత మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి ఒక్క వికెట్టూ తీయలేకపోయిన జస్ప్రీత్ బుమ్రా... ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ పై నిప్పులు చెరిగాడు. 4 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. బుమ్రా స్పెల్ లో ఒక మెయిడెన్ కూడా ఉండడం విశేషం. 

ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. బుమ్రా ధాటికి కోల్ కతా లోయర్డార్ నిలవలేకపోయింది. 

అంతకుముందు, కోల్ కతా జట్టుకు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 43 రన్స్), రహానే (25) శుభారంభం అందించారు. వన్ డౌన్ లో వచ్చిన నితీశ్ రాణా చకచకా 43 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రాణా స్కోరులో 3 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. రింకు సింగ్ 23 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (6), ఆండ్రీ రసెల్ (9) విఫలమయ్యారు. కుమార్ కార్తికేయ 2, డానియల్ శామ్స్ 1, మురుగన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.

More Telugu News