Disha Patani: ప్రభాస్ ఇంటి నుంచి దిశా పటానీకి విందు భోజనం

Special home cooked food items for Disha Patani from Prabhas
  • ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్న ప్రభాస్
  • ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో దిశా పటానీ
  • తాజాగా సెట్స్ పై అడుగుపెట్టిన బాలీవుడ్ భామ
  • ప్రభాస్ ఇంటి భోజనానికి అమ్మడు ఫిదా
తన సినిమాలో నటించే వారికి ఆహా అనిపించే రుచులతో విందు భోజనం ఏర్పాటు చేయడం ప్రభాస్ కు ఎంతో ఇష్టమైన పని. తన పక్కన నటించే బాలీవుడ్ భామలు షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే వారికి ప్రభాస్ నుంచి క్యారియర్ వెళ్లాల్సిందే. తాజాగా ప్రభాస్ ఇంటి భోజనం రుచిచూసిన వారి జాబితాలో బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దిశా పటానీ కూడా చేరింది. 

ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో ఓ కీలకపాత్రకు తాజాగా దిశా పటానీని తీసుకున్నారు. దాంతో ఆమె 'ప్రాజెక్ట్ కె' సెట్స్ పై అడుగుపెట్టింది. ఇక షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన ఆహార పదార్థాల రుచిచూసిన దిశా మైమరచిపోయింది. "థాంక్యూ ప్రభాస్... మమ్మల్ని చెడగొట్టేశావ్" అంటూ సోషల్ మీడియాలో స్పందించింది. స్లిమ్ లుక్ మెయింటైన్ చేసేందుకు నోరు కట్టుకుని మరీ డైటింగ్ నియమాలు పాటించే దిశా... ప్రభాస్ పుణ్యమాని అన్ని రకాల వంటకాలు లాగించాల్సి వచ్చింది. అందుకే అమ్మడు పైవిధంగా స్పందించింది.
.
Disha Patani
Home Food
Prabhas
Project K

More Telugu News