Vijayasai Reddy: సింగిల్ గా వస్తారో, వేరే పార్టీలతో మింగిల్ అయి వస్తారో మీ ఇష్టం: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on opposition parties
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తు అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది. అధికార పక్షం, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా పొత్తు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సింగిల్ గా వస్తారో, వేరే పార్టీలతో మింగిల్ అయి వస్తారో మీ ఇష్టం' అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీ మాత్రం సింగిల్ గానే ప్రజలతో మింగిల్ అవుతుందని పేర్కొన్నారు. "జాతి పార్టీలతో జతకడతారో, జాతీయ పార్టీలతో కలుస్తారో అది మీ ఇష్టం. మా అధినేత మాత్రం ఎప్పటికీ జనంతోనే మమేకమవుతారు" అని వివరించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Opposition Parties
Alliance
CM Jagan
YSRCP

More Telugu News