Nellore District: నెల్లూరు జిల్లాలో దారుణం.. యువతిని చంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్!

Sofware engineer fires a lady and later commits suicide
షార్ట్స్‌లో చూడండి
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో దారుణం చోటుచేసుకుంది. యువతిని తుపాకీతో కాల్చి చంపిన ఒక వ్యక్తి... ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన సురేశ్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని  చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. 

ఈ క్రమంలో కావ్య అనే యువతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తన బంధువులతో సంప్రదింపులు జరిపాడు. కావ్య తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో రగిలిపోయాడు. కావ్యను చంపాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం కావ్యను తుపాకీతో కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Nellore District
Murder
Suicide
Software Engineer

More Telugu News