Nandigam Suresh: పేదలకు డబ్బిస్తే వాళ్లు సోంబేరులుగా మారుతారని అనడం దారుణం: ఎంపీ నందిగం సురేశ్

Nandigam Suresh fires on opposition
  • గత ప్రభుత్వాల హయాంలో అగ్ర కులాలకు మాత్రమే పథకాలు అందేవన్న సురేశ్ 
  • జగన్ పాలనలో అందరికీ అందుతున్నాయని వ్యాఖ్య 
  • ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదని విమర్శ 

గత ప్రభుత్వాల హయాంలో సంక్షేమ పథకాలు కేవలం అగ్ర కులాలకు మాత్రమే అందేవని... జగన్ పాలనలో అన్ని వర్గాలకు అందుతున్నాయని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, ఇదే సమయంలో పేదలకు డబ్బులిస్తే వాళ్లు సోంబేరుల్లా మారుతారంటూ ప్రతిపక్ష నేతలు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అణగారిన వర్గాలకు అండగా ఉండాలని సీఎం ఈ పథకాలను తీసుకొచ్చారని... ఇవి ప్రతిపక్షాలకు నచ్చడం లేదని చెప్పారు. 

ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని... అందుకే ఇంటింటికి తిరిగి అందరూ కలిసి రండి అని అడుక్కుంటున్నారని నందిగం సురేశ్ అన్నారు. దత్తపుత్రుడితో కలిసి కుయుక్తులు పన్నుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసొచ్చినా జగన్ ను ఎదుర్కోలేరని అన్నారు.

  • Loading...

More Telugu News