YSRCP: ద‌మ్ముంటే క‌ర్నూలులో పోటీ చేయండి!... ప‌వ‌న్‌కు వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్‌!

ysrcp mla challenge to pawan kalyan
  • ఇటీవ‌లే క‌ర్నూలులో కౌలు రైతు భ‌రోసా యాత్ర చేప‌ట్టిన ప‌వ‌న్‌
  • యాత్ర‌లో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు
  • ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్‌
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వైసీపీ యువనేత‌, క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ ఓ స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ కర్నూలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న స‌వాల్ చేశారు. క‌ర్నూలులో ప‌వ‌న్ పోటీ చేస్తే.. గోదావ‌రి జిల్లాల కంటే కూడా ఘోరంగా ఓడించేందుకు జ‌నం సిద్ధంగా ఉన్నార‌ని హ‌ఫీజ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లే క‌ర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ గుప్పించిన విమర్శలపై స్పందించిన హ‌ఫీజ్ ఖాన్ ఈ మేర‌కు స‌వాల్ విసిరారు. 

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూసిన పవన్‌కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదని హ‌ఫీజ్ వ్యాఖ్యానించారు. కేవలం తన ఉనికిని కాపాడుకోవడం కోసమే పవన్ ఈ పర్యటనలు చేస్తున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. ప‌వ‌న్ పర్యటనలు ప్రజా మేలు కోసం కాదని, చంద్రబాబు మెప్పు పొందేందుకేన‌ని కూడా ఆయ‌న విమ‌ర్శించారు. చంద్ర‌బాబు రాసిచ్చిన‌ స్క్రిప్టును చదువుతూ ప‌వ‌న్ తిరుగుతున్నారని హ‌ఫీజ్ ఖాన్ ఎద్దేవా చేశారు.
YSRCP
Hafeez Khan
Kurnool MLA
Pawan Kalyan
Janasena

More Telugu News