దావూద్ అనుచరులు, హవాలా ఆపరేటర్లపై ఎన్ఐఏ సోదాలు!
- ముంబైలో 12 చోట్ల జరుగుతున్న సోదాలు
- గత ఫిబ్రవరిలోనే కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ
- దావూద్ అసోసియేట్స్ పై ఎప్పటి నుంచో ఆరోపణలు
వాస్తవానికి గత ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. యూఏపీఏ కేసుకు సంబంధించి దావూద్ అసోసియేట్స్ పై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు డ్రగ్స్ సరఫరాదారులు, రియలెస్టేట్ వ్యాపారులపై కూడా ఎన్ఐఏ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే దావూద్ అనుచరులపై సోదాలు నిర్వహిస్తోంది. దావూద్ అనుచరుల్లో పలువురు విదేశాల్లో ఉంటూ ఇక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.