గాంధీ భవన్‌కు తొలిసారి రాహుల్ గాంధీ రావడంపై రేవంత్ రెడ్డి ట్వీట్
కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ కార్యాలయంగా గాంధీ భవన్ కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ శాఖకు ఇదే కార్యాలయంగా కొనసాగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచిన గాంధీ భవన్‌కు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇప్పటిదాకా రానే లేదు. అయితే తాజాగా రెండు రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ తొలిసారి గాంధీ భవన్‌లో అడుగుపెట్టారు.
ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. చారిత్రక కట్టడంగా ఉన్న గాంధీ భవన్‌కు తమ నేత రాహుల్ గాంధీ తొలి సారి రావడం సంతోషాన్నిచ్చిందని సదరు ట్వీట్‌లో రేవంత్ పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు 'మైలీడర్ రాహుల్ గాంధీ' అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా ఆయన జత చేశారు.