Vijay Devarakonda: అందరికీ నా పుట్టినరోజు సెంటిమెంట్ ఎక్కువైపోయింది: విజయ్ దేవరకొండ ఛలోక్తి

Vijay Devarakonda interesting comments on his birthday
  • మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు
  • అదే రోజున అనేక చిత్రాల ప్రమోషన్ ఈవెంట్లు
  • ట్విట్టర్ లో స్పందించిన విజయ్
  • అందరికీ తన పుట్టినరోజు శక్తిని అందిస్తానని చమత్కారం
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మే 9న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా విజయ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించాడు. తన పుట్టినరోజు నాడు అనేక చిత్రాల ప్రమోషన్ ఈవెంట్లు ఉన్నాయని తెలిపాడు. చూస్తుంటే తన జన్మదినం ఓ పండుగ రోజులా అనిపిస్తోందని పేర్కొన్నాడు. అందరికీ విజయ్ దేవరకొండ బర్త్ డే సెంటిమెంట్ ఎక్కువైపోయిందని ఛలోక్తి విసిరాడు. అన్ని చిత్రాల ప్రమోషన్లు విజయవంతం అవుతాయని, అందుకు తన శక్తిని అందిస్తానని చమత్కరించాడు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో పాటు మేజర్, ఎఫ్3, అంటే సుందరానికీ, పృథ్వీరాజ్ (బాలీవుడ్ చిత్రం) ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న నేపథ్యంలో విజయ్ పైవిధంగా స్పందించినట్టు అర్థమవుతోంది.
Vijay Devarakonda
BIrthday
Sentiment
Promotions
Movies

More Telugu News