విజయ్ దేవరకొండ జోడీగా పూజ హెగ్డే!
- నిన్న మొన్నటివరకూ గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజ
- నిరాశపరిచిన భారీ సినిమాలు
- త్రివిక్రమ్ - మహేశ్ ప్రాజెక్టు పైనే ఆశలు
- పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పూజ
ఈ సినిమాల పరాజయంలో పూజ పాత్ర లేకపోయినా, ఆమె కెరియర్ పై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తాయి. అయితే ఇదే సమయంలో ఆమెకి కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే చేతిలో త్రివిక్రమ్ - మహేశ్ మూవీ ఉండటం. ఇక తాజాగా ఆమె విజయ్ దేవరకొండ జోడీగా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి 'జన గణ మన' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన పూజ హెగ్డేను సంప్రదించినట్టుగా సమాచారం. ఆల్రెడీ ఆమె ఓకే అనేసిందని కూడా అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాదైనా పూజకి కలిసిస్తుందేమో చూడాలి.