Seethakka: రాహుల్ గాంధీ చేతికి రక్ష కట్టిన సీతక్క... భుజం తట్టిన కాంగ్రెస్ అగ్రనేత

Seethakka tied Raksha to Rahul Gandhi hand in Warangal rally
  • తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ
  • వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ రైతు సంఘర్షణ సభ
  • ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రాహుల్ పరామర్శ
వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విచ్చేశారు. తొలుత ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి సంబంధించిన వివరాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... రాహుల్ గాంధీకి వివరించారు. రేవంత్ మాటల్లో వారి దైన్య పరిస్థితిని విన్న రాహుల్ అనంతరం సభా వేదిక దిశగా కదిలారు. 

ఇంతలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఎదురురావడంతో రాహుల్ చిరునవ్వు నవ్వారు. రాహుల్ ను పలకరించిన సీతక్క తనతో పాటు తెచ్చిన రక్షను రాహుల్ చేతికి కట్టారు. సీతక్క ఆప్యాయతకు స్పందనగా రాహుల్ గాంధీ ఆమె భుజం తట్టారు. అనంతరం ఇతర కాంగ్రెస్ నేతల నుంచి అభివాదాలను స్వీకరిస్తూ వేదికపైకి సాగారు. 

Seethakka
Rahul Gandhi
Raksha
Rythu Sangharshana Sabha
Warangal
Congress
Telangana

More Telugu News