Low Pressure: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... వాయుగుండంగా మారే అవకాశం

Low pressure formed in Bay Of Bengal adjoining with Andaman Sea
  • అండమాన్ సముద్రం వద్ద అల్పపీడనం
  • ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని కొనసాగుతున్న వైనం
  • రేపటి సాయంత్రానికి వాయుగుండం ఏర్పడుతుందన్న ఐఎండీ
  • ఎల్లుండి సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని, ఇది స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఈ నెల 7వ తేదీ సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమవుతుందని, ఆపై ఇంకా బలపడి 8వ తేదీ సాయంత్రానికి తుపానుగా మారి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ వివరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి వచ్చేయాలని స్పష్టం చేసింది.
Low Pressure
Bay Of Bengal
Andaman Sea
IMD

More Telugu News