శంషాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన టీపీసీసీ నేతలు
- మరికాసేపట్లో వరంగల్‌కు రాహుల్
- రైతు సంఘర్షణ సభకు హాజరు
- రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు రాక
మరికాసేపట్లో శంషాబాద్ నుంచే హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ వరంగల్ చేరుకుంటారు. వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు. ఈ సభ ముగిసిన అనంతరం రాత్రికి తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేయనున్న రాహుల్ గాంధీ.. శనివారం నాడు పార్టీ కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.