Airtel: ఎయిర్ టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు

Airtel launches new Rs 399 and Rs 839 prepaid plans with Disney Hotstar subscription
  • రూ.399 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు
  • రూ.839 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు
  • ఉచితంగా డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్
ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.399, రూ.839తో ఉన్న ఈ రెండు ప్లాన్లలో ప్రయోజనాలు, వ్యాలిడిటీ వేర్వేరుగా ఉన్నాయి.

రూ.399
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. రోజూ 2జీబీ అధిక వేగంతో కూడిన డేటా ఉచితం. 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే. ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. వీటికి అదనంగా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ మొబైల్ సబ్ స్క్రిప్షన్ మూడు నెలల పాటు ఉచితం. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ను ఒక నెల పాటు ఉచితంగా పొందొచ్చు. అలాగే, అపోలో 24/7 సర్కిల్ మెంబర్ షిప్ కూడా ఉచితంగా లభిస్తుంది.

రూ.839
ఈ ప్లాన్ చెల్లుబాటు వ్యవధి 84 రోజులు. రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా ఉచితం. 100 ఎస్ఎంఎస్ లు, కాల్స్ కూడా ఉచితమే. డిస్నీ హాట్ స్టార్  మూడు నెలల సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ మొబైల్ ప్యాక్ లభిస్తుంది. రూ.100 ఫాస్టాగ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
Airtel
prepaid
new plans

More Telugu News