Hand hygiene: వైరస్ ల నుంచి రక్షణ కావాలంటే.. చేతులను ఇలా శుభ్రం చేసుకోవాలి!

Hand hygiene dos and donts 8 expert tips to clean and hygienic hands
  • సబ్బుతో నీటి కింద శుభ్రం చేసుకోవడమే మెరుగైనది
  • కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో రుద్దుకోవాలి
  • బయటకు వెళితే శానిటైజర్లు లేదా వైప్స్ వాడొచ్చు
సూక్ష్మజీవులు ఎక్కువ శాతం చేతుల ద్వారా మన నోటిలోకి, అక్కడి నుంచి జీర్ణ వ్యవస్థ, ఇతర భాగాలకు చేరుకుంటాయి. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కనుక చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అన్నది ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన నియమాల్లో మొదటిది.

ఇక ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నియంత్రించాలంటే చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది. దీనివల్ల కరోనా వైరస్ సైతం చేతుల ద్వారా మనలోకి చేరకుండా అడ్డుకోవచ్చు. అతిసారం, మూత్ర, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.

సబ్బుతో చేతులను కడుక్కోవాలి

 మనలో చాలా మంది తరచుగా ముఖంపై చేతులు పెట్టుకుంటుంటారు. కానీ, చేతులు అంత శుభ్రంగా ఉన్నాయా? అన్నది గమనించుకోరు. ఇదే ఎన్నో అనారోగ్యాలకు మూలం అవుతుంది. ముఖ్యంగా ముఖంపై చేతులు పెట్టుకునే ముందు, ఆహారం తీసుకునే ముందు, గాయాలపై మందు రాసుకునే ముందు సబ్బుతో రుద్దుకుని నీళ్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి. 

ఎలివేటర్లను ముట్టుకున్న తర్వాత, డోర్లను మట్టుకున్న తర్వాత, చేతులను అడ్డం పెట్టుకుని తుమ్మిన తర్వాత, ముక్కు చీదిన తర్వాత కూడా ఇలాగే చేతులను శుభ్రం చేసుకోవాలి.

ఏదో నాలుగైదు సెకండ్లలో మమ అనిపించుకున్నట్టుగా కడిగేసుకోవడం కాదు. చేతుల్లోకి సబ్బు తగినంత తీసుకుని వేళ్లు, చేతులు రెండువైపులా సబ్బు అంటేలా చూసుకుని, 20 సెకండ్ల పాటు రుద్దుకోవాలి. లిక్విడ్ సోప్ లేదా సోప్ బార్ వాడుకోవచ్చు. 

చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాత పరిశుభ్రమైన వస్త్రంతో తడిని తుడిచేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో డ్రయ్యర్లను ఉపయోగించడం అంత మంచిదేమీ కాదు. అక్కడ కూడా బ్యాక్టీరియా ఉంటుంది.

బయటకు వెళుతున్నప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కునే అవకాశం లేదని తెలిస్తే.. అప్పుడు నాణ్యమైన హ్యండ్ వైప్స్ తీసుకెళ్లాలి. అలాగే, సబ్బుతో నీళ్ల కింద చేతులను శుభ్రం చేసుకునే అవకాశం లేనప్పుడు హ్యాండ్ శానిటైజర్ వినియోగించొచ్చు.
Hand hygiene
tips
hygienic
hands
health

More Telugu News