JP Nadda: కాళేశ్వ‌రం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంగా మారింది: జేపీ న‌డ్డా తీవ్ర వ్యాఖ్య‌లు

jp nadda viral comments on kcr
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లోని టీఆర్ఎస్ స‌ర్కారుపై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర తొలి ద‌శ పూర్తయిన సంద‌ర్భంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన జేపీ న‌డ్డా తెలంగాణ ప్ర‌భుత్వంపైనా, టీఆర్ఎస్‌పైనా, సీఎం కేసీఆర్‌పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింద‌ని న‌డ్డా ఆరోపించారు. తెలంగాణ‌లోనే అతి పెద్ద ప్రాజెక్టుగా ఉన్న కాళేశ్వ‌రం సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారింద‌ని కూడా ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మిష‌న్ భ‌గీర‌థ‌లో కూడా పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంద‌ని ఆయ‌న ఆరోపించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర స‌మితి కాద‌ని, తెలంగాణ రజాకార్ స‌మితి అని కూడా మ‌రింత ఘాటు ఆయన వ్యాఖ్య‌లు గుప్పించారు.
Go Back to Shorts
JP Nadda
BJP
Bandi Sanjay
Mahabubnagar

More Telugu News