Chandrababu: రుషికొండలో మీరు చేపడుతున్నది పర్యాటక ప్రాజెక్టే అయితే ఉలికిపాటు ఎందుకు?: చంద్రబాబు

Chandrababu asks govt why they obstructed him in Vizag
షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నం పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రుషికొండ హరిత రిసార్ట్స్ వద్ద నిర్మాణాలు పరిశీలించేందుకు వెళ్లబోగా, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని రుషికొండ వద్దకు వెళతానంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని ప్రశ్నించారు. అక్కడ మీరు చేపట్టింది పర్యాటక ప్రాజెక్టే అయితే ఉలికిపాటు ఎందుకని నిలదీశారు. 

విశాఖలో గానీ, రుషికొండలో గానీ వైసీపీ పెద్దలు చేస్తున్న కబ్జాలను, ఆక్రమణలను వదిలిపెట్టే ప్రసక్తేలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఇవాళ మీరు రుషికొండను పిండి చేస్తున్నారు... రేపు మిమ్మల్ని పిండి, మీరు మింగింది కక్కిస్తానని వైసీపీ నేతలను హెచ్చరించారు.
Go Back to Shorts
Chandrababu
Rushikonda
Haritha Resorts
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News