పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన ప్రభుత్వ వైద్యుడు... నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఘటన
- ఆర్థిక సమస్యలతో ఉరేసుకున్న వ్యక్తి
- పోస్టుమార్టం చేసేందుకు రూ.16 వేలు అడిగిన వైద్యుడు బాషా
- ఫోన్ పేకు ట్రాన్స్ఫర్ చేయాలంటూ హుకుం
- వైద్యుడు బాషాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఆర్థిక సమస్యలతో సతమతమైన ఓ వ్యక్తి బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా... ఆ మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి వచ్చిన వైద్యుడు బాషా... మృతుడి భార్యను రూ.16 వేల లంచం డిమాండ్ చేశాడు. తాను అడిగిన మొత్తాన్ని ఫోన్ పే ద్వారా తనకు బదిలీ చేయాలంటూ సదరు మహిళకు బాషా హుకుం జారీ చేశాడు. అప్పటికే భర్తను కోల్పోయిన వేదనలో ఉన్న ఆ మహిళ.. బాషాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.