జర్మనీలో మోదీ.. వైరల్ గా మారిన 30 ఏళ్ల నాటి ఫొటో!
- 1993లో జర్మనీకి వెళ్లిన మోదీ
- అప్పట్లో ఫ్రాంక్ ఫర్ట్ లో దిగిన ఫొటో ఇప్పుడు తెరపైకి వచ్చిన వైనం
- అప్పుడు ఆయన బీజేపీ సాధారణ నేత మాత్రమే
అయితే ఆయన జర్మనీకి వెళ్లిన సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో 1993లో మోదీ ఈ ఫొటో దిగారు. ఫొటోలో ఆయనతో పాటు ఆయన సహచరుడు కూడా ఉన్నారు.
ఈ ఫొటో దిగినప్పుడు ఆయన కేవలం బీజేపీ సాధారణ నాయకుడు మాత్రమే. ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆయన అంచెలంచెలుగా ఎదిగి... ఇప్పుడు దేశ ప్రధాని హోదాలో జర్మనీకి వెళ్లారు.