Jason Warne: జై షాతో షేన్ వార్న్ సోద‌రుడి భేటీ.. లెజండరీ స్పిన్న‌ర్ బ‌యోగ్ర‌ఫీ అంద‌జేత‌

Shane Warne younger brother Jason Warne met bcci secretary jay shah
  • గుండెపోటుతో మ‌ర‌ణించిన షేన్ వార్న్‌
  • సోద‌రుడిపై బ‌యోగ్ర‌ఫీని జై షాకు అంద‌జేసిన జాస‌న్ వార్న్‌
  • ఐపీఎల్‌లో వార్న్ పాత్ర‌ను కీర్తించిన జై షా
ప్ర‌పంచ క్రికెట్‌లో లెజండ‌రీ స్పిన్న‌ర్‌గా ఎదిగిన ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ షేన్ వార్న్ ఇటీవ‌లే గుండెపోటుతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం నాడు షేన్ వార్న్ సోద‌రుడు జాస‌న్ వార్న్ బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షాతో భేటీ అయ్యారు. త‌న సోద‌రుడి బ‌యోగ్రఫీని జై షాకు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా షేన్ వార్న్ ను వారిద్ద‌రూ స్మరించుకున్నారు.

షేన్ వార్న్ సోద‌రుడు జాస‌న్ వార్న్ త‌న‌ను క‌లిసిన విష‌యాన్ని జై షానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదికగా వెల్ల‌డించారు. షేన్ వార్న్ సోద‌రుడిని క‌లుసుకోవ‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌ని చెప్పిన షా... అంత‌ర్జాతీయ క్రికెట్‌కు షేన్ వార్న్ చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ప్ర‌త్యేకించి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో షేన్ వార్న్ పాత్ర‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని ఈ సంద‌ర్భంగా జై షా పేర్కొన్నారు.
Jason Warne
Shane Warne
Jay Shah
BCCI

More Telugu News