IPL 2022: ఐపీఎల్ ఫైనల్ అహ్మ‌దాబాద్‌లో!... క్వాలిఫ‌య‌ర్ 1, ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లు ఈడెన్ గార్డెన్స్‌లో!

ipl 2022 finals in narendra modi stadium in ahmedabad
షార్ట్స్‌లో చూడండి
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ (ఐపీఎల్‌) లీగ్ తాజా సీజ‌న్‌లో మ్యాచ్‌ల‌న్నింటినీ మ‌హారాష్ట్రలోని స్టేడియంలలోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా బీసీసీఐ గ‌తంలో ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ను కాస్తంత మారుస్తూ తాజాగా బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ప్లే ఆఫ్ మ్యాచ్‌ల‌ను గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌, ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తాలో నిర్వ‌హించ‌నున్నారు.

ఐపీఎల్ తాజా సీజన్‌లో ప్లే ఆఫ్ ద‌శ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ మంగ‌ళ‌వారం ఈ ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. ఈ సీజన్‌లో ఈ నెల 29న జ‌ర‌గ‌నున్న టైటిల్ పోరును అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో నిర్వ‌హించ‌నుండ‌గా... అంత‌కు ముందే ఈ నెల 27న క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌నూ ఇక్క‌డే నిర్వ‌హిస్తారు. ఇక కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్ (మే 24)తో పాటు ఎలిమినేట‌ర్ మ్యాచ్‌(మే 25)ను నిర్వ‌హిస్తారు.
Go Back to Shorts
IPL 2022
BCCI
Jay Shah
Narendra Modi Stadium
Eden Gardens

More Telugu News