జోధ్ పూర్ లో మళ్లీ చెలరేగిన ఘర్షణలు.. బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ముందు బైక్ దహనం
- పోలీస్ స్టేషన్ పైకి రాళ్లు రువ్విన ఓ వర్గం
- సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు
- గుంపులుగా చేరి నానా బీభత్సం
- రోడ్డుపై ఎక్కడ చూసినా రాళ్లు
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సూర్యకాంత వ్యాస్ ఇంటి ముందు బైకును తగుల బెట్టారు. కాగా, అంతకుముందు కేంద్ర మంత్రి, జోధ్ పూర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ ఆ ప్రాంతంలో పర్యటించారు. పరిస్థితిని సమీక్షించారు. నిన్న హిందువుల జెండాను తొలగించి ముస్లిం జెండాను పెట్టడం దగ్గర మొదలైన గొడవ చిలికిచిలికి గాలివానలాగా మారిన సంగతి తెలిసిందే.
స్వాతంత్ర్య సమరయోధుడు బాల ముకుంద్ బిస్సా విగ్రహానికి ఓ బ్యానర్ ను తగిలించి ఈద్ శుభాకాంక్షలు తెలియజేయడం, మైక్ కూడా పెట్టడంతో గొడవ మరింత ముదిరిందని చెబుతున్నారు. ఆ బ్యానర్, జెండాను తొలగించడంతో గొడవ పెద్దదైందని అంటున్నారు.