ప్రయాణికులను హడలెత్తించిన స్పైస్ జెట్ విమానం.. 10 మందికి గాయాలు
- ల్యాండింగ్ సమయంలో సమస్య
- తీవ్ర కుదుపులకు లోనైన విమానం
- దుర్గాపూర్ లో సురక్షితంగా ల్యాండింగ్
- గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స
దీంతో విమానం లోపలి ప్రయాణికుల వస్తువులు చెల్లాచెదురయ్యాయి. లగేజీ బ్యాగేజీలు వచ్చి మీద పడ్డాయి. దీంతో పది మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులను ప్రయాణికులు కొందరు తమ ఫోన్లలో వీడియో తీయగా.. అటువంటి వీడియో ఒకటి ట్విట్టర్ లోకి చేరింది. ఎట్టకేలకు విమానం దుర్గాపూర్ విమానాశ్రయంలో సురక్షితంగానే ల్యాండ్ అయింది. అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల స్పైస్ జెట్ విచారం వ్యక్తం చేసింది. గాయపడిన వారికి వైద్య సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది.