ప్రభాస్ జోడీగా అనుష్కను సెట్ చేయనున్న మారుతి!
- పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్న ప్రభాస్
- సినిమాల సంఖ్యను తగ్గించివేసిన అనుష్క
- ఇద్దరి కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేస్తున్న మారుతి
- పరిశీలనలో 'రాజా డీలక్స్' టైటిల్
ఈ జంటను మళ్లీ తెరపైకి తీసుకుని రావడానికి చాలామంది దర్శకులు ట్రై చేస్తున్నారు. ఆ జాబితాలో మారుతి పేరు కూడా వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి 'రాజా డీలక్స్' సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో కథానాయికగా అనుష్కను తీసుకోనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ఒక వార్త షికారు చేసింది. ఆమెనే ఎంపిక చేయనున్నారనేది తాజా సమాచారం. మరో ఇద్దరు కథానాయికలకు కూడా చోటు ఉండటంతో, ఎవరైతే బాగుంటారా? అనే దిశగా అన్వేషణ సాగుతోందట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు.