కరోనా ఫోర్త్ వేవ్ పై మరింత స్పష్టత నిచ్చిన ఐసీఎంఆర్
- దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
- ఫోర్త్ వేవ్ అంటూ జరుగుతున్న ప్రచారం
- కొన్ని జిల్లాల్లోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయన్న ఐసీఎంఆర్
- తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నారని వివరణ
ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా కరోనా టెస్టులు చేయడంలేదని అన్నారు. తక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేసినప్పుడు వచ్చే పాజటివ్ కేసుల సంఖ్య ఆధారంగా ఆ ప్రాంతంలో కరోనా అధికంగా ఉన్నదని చెప్పలేమని తెలిపారు. అధిక సంఖ్యలో టెస్టులు చేసినప్పుడు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తేనే అక్కడ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్టు భావించాలని వివరించారు.