CPI Narayana: కేటీఆర్ రాత్రికి రాత్రే మాట మార్చేశారు: సీపీఐ నారాయణ

CPI Narayana strongly condemns KTR tweet
  • ఏపీలో పరిస్థితులు అధ్వానం అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు
  • కేటీఆర్ వ్యాఖ్యలతో రాజకీయంగా సెగలు పొగలు
  • తన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదన్న కేటీఆర్
  • కేటీఆర్ ట్వీట్ ను తప్పుబట్టిన నారాయణ
ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ పొరుగురాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇంకా ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే ఆ రోజు అర్ధరాత్రే... తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని, జగన్ పరిపాలనలో ఏపీ అభివృద్ధి పథంలో పయనించాలంటూ కేటీఆర్ ట్వీట్ చేయగా, నారాయణ తప్పుబట్టారు. 

ఇవాళ మేడే సందర్భంగా రాజమండ్రిలో పర్యటించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ... ఏపీపై చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ రాత్రికి రాత్రే మాట మార్చేశారని నారాయణ ఆరోపించారు. బహుశా ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతోనే కేటీఆర్ మాట మార్చారేమో అని సందేహం వ్యక్తం చేశారు.  ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నది వాస్తవం అని, రోడ్ల పరిస్థితిని నగరిలో తాను ప్రత్యక్షంగా చూశానని నారాయణ వెల్లడించారు. తన వీడియో చూసిన మంత్రి రోజా రోడ్లు బాగుచేయాలని వెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారని వివరించారు.
CPI Narayana
KTR
Andhra Pradesh
CM Jagan

More Telugu News