Telangana: సీఎం కేసీఆర్ భయపడ్డారు.. నేనెవరో గూగుల్​ లో వెతికితే తెలుస్తుంది: కేఏ పాల్​ ఫైర్​

KA Paul Fires on Cm KCR
  • మే 6న తన సభకు పర్మిషన్ ఇవ్వలేదన్న పాల్ 
  • పోలీసులను కేసీఆర్ బెదిరించారని ఆరోపణ
  • రాహుల్ కు ఇచ్చి తనకెందుకు ఇవ్వరని ప్రశ్న 
తెలంగాణ పోలీసులపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. మే 6న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వలేదని, కానీ, ఓటు బ్యాంకు లేని రాహుల్ గాంధీకి మాత్రం అనుమతినిచ్చారని అన్నారు. రైతుల కోసం సభ నిర్వహించి ఉద్యమం చేస్తున్నందుకే సీఎం కేసీఆర్ భయపడి అనుమతి ఇవ్వకుండా ఆపుతున్నారని అన్నారు. తనకు అనుమతి ఇవ్వవద్దంటూ హైదరాబాద్, వరంగల్ కమిషనర్లను బెదిరించారని ఆరోపించారు. 

బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి.. అప్పుల సర్కార్ చేసిందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, నిరుద్యోగులకు అండగా పోరాడుతానని చెప్పారు. నిన్నగాక మొన్న రాహుల్ కు పర్మిషన్ ఇచ్చి.. తనకెందుకు ఇవ్వరని నిలదీశారు. తానెవరో తెలియదంటూ కమిషనర్ అన్నారని, గూగుల్ లో నా పేరు వెతికితే తెలుస్తుందని ఎద్దేవా చేశారు.  

సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేదని, సభకు అనుమతివ్వలేదని, అయినంతమాత్రాన ఆగుతానా? అని ప్రశ్నించారు. అసలు తననెవరూ ఆపలేరని, ఎలా ఆపుతారో చూస్తానని పాల్ సవాల్ విసిరారు.
Telangana
KA Paul
KCR
Police

More Telugu News