పెళ్లిలో పాముతో నాగిని డ్యాన్స్.. ఐదుగురు అరెస్ట్.. వీడియో ఇదిగో!

Five arrested in Odisha snake dance incident
  • ఒడిశాలోని మయూర్ భంజ్ లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన పోలీసులు
పెళ్లి వేడుకలో నాగిని డ్యాన్స్ వేసి కటకటాల పాలైన ఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఓ వివాహ వేడుక కోసం పాములు పట్టే వ్యక్తిని పిలిపించి, నాగిని డ్యాన్స్ చేయించారు. ఆ వ్యక్తి బుట్టలో పామును పెట్టుకుని నాగిని డ్యాన్స్ చేస్తుండగా.. మిగిలిన వాళ్లు చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

వీటిని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పామును ఆడించిన వ్యక్తితో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి తరలించారు. పామును అటవీశాఖ అధికారులకు అందించారు. వన్యప్రాణుల చట్టం ప్రకారం పామును అలా ఆడించడం దాన్ని హింసించడం అవుతుంది. అంతేకాదు, ఆ పాము వల్ల జనాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది.
Go Back to Shorts
Odisha
Snake Dance
Arrest

More Telugu News