కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్.. వీడియో అమ్మకానికి ..!
- భార్యపై అత్యాచారానికి ప్రోత్సాహం
- వీడియో తీసి పోర్టల్ లో పోస్ట్
- రాజస్థాన్ లో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
‘‘ఒక మహిళ అత్యాచారం కేసు నమోదు చేసింది. తన భర్త, ఇద్దరు బంధువులు అందులో పాల్గొన్నట్టు పేర్కొంది. పోర్నోగ్రాఫిక్ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినట్టు ఆరోపణ. దీన్ని ఇంకా ధ్రువీకరించుకోవాల్సి ఉంది’’అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ దౌలత్ సాహు తెలిపారు. 2019లో వివాహం కాగా, అప్పటి నుంచి భర్త తరఫు వారు కట్నం కోసం వేధిస్తున్నట్టు బాధితురాలి వాదనగా ఉంది. కట్నం తేలేకపోవడంతో తనపై అత్యాచారం చేయించి, వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినట్టు ఆమె చెప్పింది.