Perni Nani: గిలకలదిండి హార్బర్ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి.. హాజరైనా దూరంగానే ఉండిపోయిన పేర్నినాని

Union Minister inspects the works of Gilakadindi Harbor Ex minister Perni Nani stands away
  • మంత్రులకు దూరంగా నిలబడిన పేర్ని నాని
  • చేయి పట్టుకుని తీసుకెళ్లిన మంత్రి సీదిరి అప్పలరాజు
  • సముద్ర మొగ పరిశీలనకూ వెళ్లని వైనం
కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి హాజరైన ఓ కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని వచ్చినప్పటికీ వారికి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. కేంద్ర మత్యశాఖ మంత్రి మురుగన్ నిన్న రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి మచిలీపట్టణంలోని గిలకలదిండి హార్బర్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి పేర్ని నాని కూడా హాజరయ్యారు. అయితే, మంత్రులకు దూరంగా ఎక్కడో దూరంగా నిలబడిపోయారు.

గమనించిన మంత్రి అప్పలరాజు వెంటనే ఆయన వద్దకు వెళ్లి పనులు పరిశీలించేందుకు రావాలని చేయిపట్టుకుని తీసుకెళ్లినప్పటికీ నాని దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత సముద్ర మొగ పరిశీలన కోసం మురుగన్, అప్పలరాజు, ఇతర ఉన్నతాధికారులు పడవలో వెళ్లారు. అయితే, నాని మాత్రం ఒడ్డునే ఉండిపోయారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేర్నినాని మాట్లాడుతూ.. కేంద్రమంత్రి మురుగన్ తెలుగులో చక్కగా మాట్లాడతారని, నిగర్వి అని ప్రశంసించారు. కార్యక్రమానికి దూరంగా ఉన్న విషయమై స్పందిస్తూ.. తాను ఎప్పుడూ వెళ్లే ప్రదేశమే కదా అన్న ఉద్దేశంతోనే వెళ్లలేదని చెప్పారు.
Perni Nani
Seediri Appalaraju
Murugan
Gilakaladindi
Krishna District

More Telugu News