LSG: అతి కష్టమ్మీద 153 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

LSG registers 153 runs against Punjab Kings
  • పుణేలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
  • రాణించిన బౌలర్లు
  • రబాడాకు 4, చాహర్ కు 2 వికెట్లు
  • 46 పరుగులు చేసిన డికాక్
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పరుగుల కోసం చెమటోడ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 46, దీపక్ హుడా 34 ఓ మోస్తరుగా రాణించారు. ఆఖర్లో దుష్మంత చమీర 17, మొహిసిన్ ఖాన్ 13(నాటౌట్), జాసన్ హోల్డర్ 11 పరుగులు చేయడంతో లక్నో జట్టుకు ఆమాత్రం స్కోరైనా వచ్చింది. 

పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడా 4 వికెట్లతో లక్నో జట్టును హడలెత్తించాడు. రాహుల్ చహర్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఆరంభంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (6) స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో లక్నో భారీ స్కోరు ఆశలను దెబ్బతీసింది. కృనాల్ పాండ్య (7),  మార్కస్ స్టొయినిస్ (1) విఫలమయ్యారు.
LSG
Punjab Kings
Pune
IPL

More Telugu News