ఏపీలో తాజాగా 8 మందికి కరోనా
- రోజువారీ బులెటిన్ విడుదల చేసిన కమాండ్ కంట్రోల్
- 4,577 మందికి కరోనా పరీక్షలు
- ఏలూరు, విశాఖ జిల్లాల్లో రెండేసి కేసులు
- కరోనా నుంచి కోలుకున్న నలుగురు
ఏలూరు జిల్లాలో 2, విశాఖ జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1, అనంతపురం జిల్లాలో 1, బాపట్ల జిల్లాలో 1, తిరుపతి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మృతి చెందారు.
.