TDP: ర‌మ్య హంత‌కుడికి ఉరిశిక్ష‌పై చంద్ర‌బాబు స్పంద‌న‌

  • గుంటూరులో బీటెక్ విద్యార్దిని ర‌మ్య హ‌త్య‌
  • నిందితుడికి ఉరి శిక్ష విధించిన కోర్టు
  • తీర్పును స్వాగ‌తించిన టీడీపీ అధినేత 
  • ఈ త‌ర‌హాలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల్లో బాధితుల‌కు న్యాయం ద‌క్కాల‌న్న చంద్ర‌బాబు
chandrababu welcomes guntur special court judgement

గుంటూరు న‌గ‌రంలో ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని ర‌మ్య‌ను క‌త్తితో పొడిచి హ‌త్య చేసిన నిందితుడు శ‌శికృష్ణ‌కు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు ప్ర‌త్యేక కోర్టు శుక్ర‌వారం నాడు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ తీర్పుపై టీడీపీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. 

గత స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్ధిని రమ్యను పట్టపగలు నడిరోడ్డుపై చంపిన ఉన్మాదికి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని తాను స్వాగతిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అదే మాదిరిగా గత మూడేళ్లలో జరిగిన 800కు పైగా ఘటనల్లో కూడా బాధిత కుటుంబాలకు త్వరగా న్యాయం దక్కాలని కోరుకుంటున్న‌ట్లు చంద్ర‌బాబు తెలిపారు.

More Telugu News