usa: అమెరికాలో మనుషుల్లో వెలుగు చూసిన తొలి బర్డ్ ఫ్లూ కేసు

  • కొలరాడోలో నమోదు
  • కొన్ని రోజుల పాటు అలసట
  • చికిత్సతో రికవరీ
  • ప్రపంచంలో రెండో కేసు
US reports first human H5 bird flu case in Colorado resident

అమెరికాలో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు మనుషుల్లో వెలుగు చూసింది. కొలరాడోకు చెందిన వ్యక్తిలో ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా ఏ(హెచ్5) వైరస్ పాజిటివ్ గా బయటపడినట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విభాగం ప్రకటన విడుదల చేసింది. హెచ్5 వైరస్ మనుషుల్లో కనిపించడం అరుదు. ఇలాంటిదే ఒక కేసు 2021 డిసెంబర్ లో బ్రిటన్ లోనూ వెలుగు చూసింది. 


కొలరాడో వ్యక్తికి కొన్ని రోజులుగా అలసటగా ఉండడం తప్పించి మరే ఇతర లక్షణాలు కనిపించలేదని సీడీసీ తెలిపింది. అతడు ఒక్కడినీ విడిగా ఉంచి ఇన్ ఫ్లూయెంజా యాంటీ వైరల్ ఔషధంతో చికిత్స చేసినట్టు పేర్కొంది. ఇప్పుడు ఆ రోగి పూర్తిగా కోలుకున్నాడు. బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1 వైరస్) బారిన పడిన పక్షులకు సన్నిహితంగా ఉన్న 2,500 మందిని పరిశీలనలో ఉంచినట్టు సీడీసీ ప్రకటించింది.

More Telugu News