అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనులు మోదీ, అమిత్ షా: బాల్క సుమన్
- బీజేపీ కార్పొరేట్ పార్టీ అంటూ సుమన్ వ్యాఖ్యలు
- సంగ్రామ యాత్ర కాదు, పాపాల యాత్ర చేపడుతున్నారని విమర్శ
- మీ డబుల్ ఇంజిన్ కు దేశ ప్రజలు ఎర్రజెండా చూపిస్తారని ఎద్దేవా
కర్ణాటకలో బీజేపీ మంత్రి అవినీతి ఆరోపణలతో రాజీనామా చేశారని అన్నారు. 'దేశంలో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనులు మోదీ, అమిత్ షా... మీరా మాపై అవినీతి ఆరోపణలు చేసేది?' అని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. బీజేపీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.