ఎమ్మెల్యే తండ్రి ద‌శ‌దిన క‌ర్మ‌కు హాజ‌రైన కేసీఆర్‌... అక్క‌డే స‌హ‌పంక్తి భోజ‌నం

kcr condolences to dhirumarthi lingaiah family
  • ఇటీవ‌లే మృతి చెందిన లింగ‌య్య తండ్రి న‌ర‌సింహ‌
  • గురువారం నార్క‌ట్‌ప‌ల్లిలో ద‌శ దిన క‌ర్మ‌
  • స్వ‌యంగా హాజ‌రై లింగ‌య్య‌ను ఓదార్చిన కేసీఆర్‌
  • కేసీఆర్ వెంట టీఆర్ఎస్ కీల‌క నేత‌లంతా హాజ‌రు
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు త‌న పార్టీకి చెందిన కీల‌క నేత‌, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య తండ్రి ద‌శ దిన క‌ర్మ‌కు హాజ‌ర‌య్యారు. లింగ‌య్య తండ్రి నర‌సింహ ఇటీవ‌లే మృతి చెంద‌గా...లింగ‌య్య సొంతూరు నార్క‌ట్‌ప‌ల్లిలో గురువారం నాడు ద‌శ దిన క‌ర్మ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స్వయంగా హాజ‌రైన కేసీఆర్‌.... కార్య‌క్ర‌మంలో భాగంగా అక్క‌డే ఏర్పాటు చేసిన సహ‌పంక్తి భోజ‌నంలో పాల్గొన్నారు.

తండ్రిని కోల్పోయిన బాధ‌లో ఉన్న చిరుమ‌ర్తి లింగ‌య్య‌ను ఓదార్చిన కేసీఆర్‌... లింగ‌య్య కుటుంబ సభ్యుల‌కు ధైర్యం చెప్పారు. కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, జ‌గ‌దీశ్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిల‌తో పాటు ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.
Go Back to Shorts
KCR
TRS
KTR
Nakirekal MLA
Chirumarthi LIngaiah

More Telugu News