చెన్నై భూమి వ్యవహారంలో అశోక్ గజపతిరాజుకు ఊరట!

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చెన్నైలోని మైలాపూర్ లో 37,902 చదరపు అడుగుల భూమికి సంబంధించిన వ్యవహారంలో ఆయనకు హైకోర్టు స్వల్ప ఊరటను ఇచ్చింది. ఆ భూమికి సంబంధించిన దస్త్రాలను స్వయంగా తీసుకుని తమ వద్దకు రావాలంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. అంతేకాదు... ఏ వివరాల ఆధారంగా అశోక్ గజపతిరాజు, ఆయన సోదరి రాజా వాసిరెడ్డి సునీత ప్రసాద్ పై ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారని హైకోర్టు ఈడీని ప్రశ్నించింది.


More Telugu News