ఖుషీ మూవీకి 21 ఏళ్లు... మధుర స్మృతులను నెమరువేసుకున్న భూమిక
- మధుగా ఖుషీలో కనిపించిన భూమిక
- ఆ పాత్ర తనకు మంచి గుర్తింపు నిచ్చిందన్న నటి
- చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భూమిక ట్వీట్
ఖుషీ చిత్రానికి 21 ఏళ్లు నిండిన సందర్భంగా భూమిక ఆ చిత్రంలో తన నటన, చిత్ర బృందంతో తనకు దక్కిన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఈ సినిమాలో మధుగా తనకు దక్కిన గుర్తింపును ప్రధానంగా ప్రస్తావించింది. తనకు జోడీగా నటించిన పవన్‌తో పాటు చిత్ర దర్శకుడు ఎస్జే సూర్య, నిర్మాత ఏఎం రత్నంలకు ప్రత్యేకంగా ఆమె కృతజ్ఞతలు తెలిపింది.